Mon Dec 23 2024 23:36:38 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఎన్నికల కమిషన్ సమావేశం
రిమోట్ ఓటింగ్ యంత్రాన్ని ప్రదర్శించేందుకు నేడు కేంద్ర ఎన్నికల కమిషన్ అన్ని పార్టీలకుసమావేశాన్ని ఏర్పాటు చేసింది.
రిమోట్ ఓటింగ్ యంత్రాన్ని ప్రదర్శించేందుకు నేడు కేంద్ర ఎన్నికల కమిషన్ అన్ని పార్టీలకుసమావేశాన్ని ఏర్పాటు చేసింది. దేశంలోి అన్ని పార్టీలను ఆహ్వానించింది. తమ ఓటు హక్కును ఎక్కడి నుంచైనా వినియోగించేందుకు వీలుగా ఈ యంత్రాన్ని ప్రవేశపెట్టాలని, తద్వారా ఓటింగ్ శాతాన్ని పెంచాలన్నది కేంద్ర ఎన్నికల కమిషన్ ఆలోచనగా ఉంది.
వలస ఓటర్ల కోసం...
వలస ఓటర్ల కోసం ఈ రిమోట్ ఎలక్ట్రానికి ఓటింగ్ మెషిన్ ప్రొటోటైప్ ను ఎన్నికల సంఘం ప్రవేశ పెట్టాలనుకుంటుంది. ఎనిమిది జాతీయ పార్టీలను, 57 గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు ఇప్పటికే ఆహ్వానం అందాయి. ఏపీ నుంచి వైసీపీ, తెలుగుదేశం పార్టీలు హాజరు కానున్నాయి. టీడీపీ తరుపున ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తో పాటు వేమూరి రవికుమార్ లు హాజరుకానున్నారని తెలిసింది.
Next Story