Sat Nov 23 2024 23:16:08 GMT+0000 (Coordinated Universal Time)
తెలుగింట పద్మశ్రీలు
కేంద్ర ప్రభుత్వం రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ పురస్కారాలను ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వం రిపబ్లిక్ డే సందర్భంగా పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఈ ఏడాది 109 మందికి పద్మశ్రీ, ఆరుగురికి పద్మవిభూషణ్, తొమ్మిది మందికి పద్మభూషణ్ పురస్కారాలు వరించాయి. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఈ ప్రకటనను విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా పద్మశ్రీ పురస్కారాలు దక్కడం విశేషం. మొత్తం 12 మంది తెలుగు రాష్ట్రాలకు చెందిన వారికి పద్మ పురస్కారాలు దక్కాయి. తెలంగాణను ఆధ్యాత్మిక విభాగంలో చినజీయర్ స్వామి, కమలేష్ డి.పటేట్ పద్మభూషణ్ కు ఎంపికయ్యారు.
అత్యధికంగా...
ఇక ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణికి పద్మశ్రీ దక్కింది. తెలంగాణ నుంచి ప్రముఖ శాస్త్రవేత్త మోదడుగు విజయ్ గుప్తా, వైద్యుడు పసుపులేటి హనుమంతరావు, ప్రముఖ భాషా వేత్త రామకృష్ణారెడ్డి, ఏపీ నుంచి ఇంజినీర్లు అబ్బారెడ్డి నాగేశ్వరరావు, ఏటికొప్పాకకు చెంిన కళాకారుడు సీవీరాజు, హరికధ విద్వాంసుడుకోట సచ్చిదానంద శాస్త్రి, ప్రముఖ సామాజికవేత్త సంకురాత్రి చంద్రవేఖర్, విద్యావేత్త ప్రకా్ చంద్రసూద్ పద్మశ్రీ పురస్కారాలకు కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.
Next Story