Mon Dec 23 2024 09:41:31 GMT+0000 (Coordinated Universal Time)
కరోనాపై కేంద్రం హైఅలెర్ట్
కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం సీరియస్ నిర్ణయాలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది.
కరోనా కేసుల పెరుగుదలపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తయింది. కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం సీరియస్ నిర్ణయాలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. ప్రధానంగా ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళలో కరోనా కేసులు ఎక్కువగా కరోనా పై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. ఈ మూడు రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది. కేసులు పెరుగుతుండటంతో తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది.
ఆ మూడు రాష్ట్రాలకు....
టెస్ట్, ట్రాక్, వ్యాక్సినేషన్ ప్రక్రియలను వేగవంతం చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ ఈ మూడు రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. గత రెండు రోజులుగా కరోనా కేసులు దేశ వ్యాప్తంగా పెరుగుతున్నాయి. ఈరోజు ఐదు వేలకు పైగానే కేసులు నమోదయ్యాయి. యాక్టివ్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ మూడు రాష్ట్రాల్లో వెయ్యికి పైగానే కరోనా కేసులు రోజూ నమోదవుతున్నాయి. దీంతో ఈ మూడు రాష్ట్రాలను కరోనా కట్టడికి ప్రత్యేక వ్యూహాన్ని అనుసరించాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సూచించింది.
Next Story