Mon Dec 23 2024 17:16:09 GMT+0000 (Coordinated Universal Time)
పీఎఫ్ఐ నిషేధం.. ఎంతకాలమంటే?
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నిషేధం ఐదేళ్ల పాటు కొనసాగనుందని ఉత్తర్వుల్లో పేర్కొంది
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నిషేధం ఐదేళ్ల పాటు కొనసాగనుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. తక్షణమే నిషేధం అమలులోకి వస్తున్నట్లు ప్రకటించింది. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నందున పీఎఫ్ఐ పై నిషేధం విధించినట్లు కేంద్ర హోంశాఖ విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎన్ఐఏ, ఈడీలు ఇప్పటికే దేశ వ్యాప్తంగా ఉన్న పీఎఫ్ఐ కార్యాలయాలు, ముఖ్య కార్యకర్తల ఇళ్లలో సోదాలు జరిపాయి. 170 మందికి పైగా అదుపులోకి తీసుకున్నారని అధికార వర్గాలు వెల్లడించాయి.
మొత్తం ఏడు రాష్ట్రాల్లో ....
మొత్తం ఏడు రాష్ట్రాల్లో ఎన్ఐఏ, ఈడీ దాడులు కొనసాగాయి. ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటక, అసోం, కేరళ, ఢిల్లీ, మధ్యప్రదేశ్ లో ఈ దాడులు నిర్వహించారు. కొందరిపై దాడులు చేసే లక్ష్యంగా ఈ సంస్ధ కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు సోదాల్లో బయటపడింది. వీరిలో కొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఉగ్రవాద సంస్థల్లో చేరేలా యువతను ప్రోత్సహించేందుకు పీఎఫ్ఐ శిక్షణ కొనసాగుతుందని ఎన్ఐఏ వర్గాలు చెబుతున్నాయి. పీఎఫ్ఐ కు సంబంధించిన కేసులను విచారించేందుకు ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా బార్ అసోసియేషన్ కేంద్రాన్ని కోరింది. మొత్తం 11 రాష్ట్రాల్లో 106 మందిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేయగా, వీరిలో అత్యధకిగా కేరళలో22 మందిని అదుపులోకి తీసుకున్నారు.
Next Story