Sat Nov 23 2024 00:05:38 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : కరోనాపై కేంద్రం అలర్ట్ : ఆరు రాష్ట్రాలకు వార్నింగ్
కరోనా కేసులు సంఖ్య మళ్లీ పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. ఆరు రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసింది
కరోనా కేసులు సంఖ్య మళ్లీ పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. ఆరు రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆరు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది. టెస్ట్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ లు మూడు సత్వరం చేపట్టాలని కోరింది. వ్యాక్సినేషన్ ను కూడా వేగవంతం చేయాలని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
నిబంధనలను...
ఈ ఆరు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండటం పట్ల ఆందోళన కలిగిస్తుందని పేర్కొంది. కరోనా నిబంధనలు ప్రజలు పాటించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసింది. మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఈ హెచ్చరికలు జారీ చేసింది.
Next Story