Wed Jan 15 2025 18:03:10 GMT+0000 (Coordinated Universal Time)
పది రాష్ట్రాలకు కేంద్ర బృందాలు.. ఒమిక్రాన్ కేసులున్న..?
దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. భారత్ లో ఇప్పటికే 245 కేసులు నమోదయ్యాయి
దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. భారత్ లో ఇప్పటికే 245 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మొత్తం పదిహేడు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అయితే అతి తీవ్రంగా పది రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
అధ్యయనం చేసి.....
అక్కడ ఒమిక్రాన్ కేసుల నమోదు, కోవిడ్ నిబంధన అమలు వంటి వాటిపై ఈ బృందం అధ్యయనం చేస్తుంది. వ్యాక్సినేషన్ ఎంత మేరకు జరిగింది కూడా పరిశీలిస్తుంది. ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా నమోదయిన కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మిజోరాం, ఉత్తర్ ప్రదేశ్, బీహార్, జార్ఖండ్ లలో ఈ బృందం పర్యటిస్తుంది.
Next Story