Mon Dec 23 2024 11:18:15 GMT+0000 (Coordinated Universal Time)
డిసెంబరులో 4 నుంచి పార్లమెంటు సమావేశాలు
డిసెంబరు 4వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ శీతాకాలపు సమావేశాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది
డిసెంబరులో పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబరు 4వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ శీతాకాలపు సమావేశాలు నిర్వహించాలని డిసైడ్ చేసింది. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్మాద్ జోషి వెల్లడించారు. ఈ సమావేశాలు దాదాపు పదిహేను రోజుల పాటు జరగనున్నాయి.
కీలక బిల్లులను...
ఈ సమావేశాల్లో కీలక బిల్లును ఆమోదించుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తుంది. డిసెంబరు 3వ తేదీన ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల కౌంటింగ్ పూర్తి కానుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గడ్, తెలంగాణ, మిజోరాం ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతోనే డిసెంబరు 4వ తేదీ నుంచి సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది.
Next Story