Sun Dec 22 2024 09:32:46 GMT+0000 (Coordinated Universal Time)
ఈ నెల 22న హాఫ్ డే హాలిడే..కేంద్ర ప్రభుత్వ ప్రకటన
అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ట సందర్భంగా కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 22న ఆఫ్ హాలీడేగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది
అయోధ్య రాముడి ప్రాణప్రతిష్ట సందర్భంగా కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఈ నెల 22న ఆఫ్ హాలీడేగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే కార్యాలయాలన్నింటికి ఈ సెలవు వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. అయోధ్యలో రాముల వారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని వీక్షించేందుకు ప్రభుత్వం హాఫ్ డే సెలవును ప్రకటించింది. ప్రభుత్వ ఉద్యోగులందరూ అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ట పూర్తయిన తర్వాత ఆఫీసులకు వెళ్లి తమ పనులు చేసుకోవాల్సి ఉంటుంది.
మోదీకి గిఫ్ట్.....
మరోవైపు అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట ముహుర్తం వేళ ప్రధాని మోడీకి ఓ ముస్లిం యువతి బహుమతి ఇచ్చారు. ఇదే విషయాన్ని ఎక్స్ లో ప్రధాని మోడీ పంచుకున్నారు. "గురువయార్లో జాస్నా సలీమ్ నుంచి భగవాన్ శ్రీ కృష్ణుడి పెయింటింగ్ అందుకున్నాను. కృష్ణుడి భక్తిలో ఆమె ప్రయాణం పరివర్తన శక్తికి నిదర్శనం. ఆమె కొన్నేళ్లుగా గురువాయుర్లో భగవాన్ శ్రీకృష్ణుడి చిత్రాలను వేస్తున్నారు. అలాగే ప్రధాన పండుగలపై కూడా పెయింటింగ్ వేస్తున్నారు’ అని మోడీ ట్వీట్ చేశారు.
Next Story