Fri Mar 28 2025 23:13:49 GMT+0000 (Coordinated Universal Time)
రైతులకు గుడ్ న్యూస్.. వారి ఖాతాల్లో నగదు జమ నాలుగు రోజుల్లో
కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది.

కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం కిసాన్ పథకం కింద రైతుల ఖాతాల్లో ఈ నెల 24వ తేదీన నిధులు జమ చేస్తామని తెలిపింది. ఒక్కొక్కరి ఖాతాలో రెండు వేల రూపాయల నగదు జమ అవుతుందని పేర్కొంది. ఏటా రైతుల ఖాతాల్లో ఆరు వేల రూపాయల నగదును పీఎం కిసాన్ సమ్మాన్ పథకం కింద మూడు విడతలుగా జమ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ 18 విడతలుగా కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో నిధులను జమ చేస్తూ వస్తుంది. ప్రస్తుతం విడుదల చేయనుంది 19 విడత.
24న బాగల్పూర్ లో...
అందులో భాగంగా ఈ నెల 24వ తేదీన రెండు వేల రూపాయల నగదును జమ చేయాలని నిర్ణయించింది. బీహార్ లోని భాగల్పూర్ లో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 24వ తేదీన ఈ పథకం నిధులను విడుదల చేయనున్నట్లు పేర్కొంది. అయితే దీనికి సంబంధించి కేవైసీ చేసుకోని వాళ్లు ఎవరైనా ఉంటే చేసుకోవాలని సూచించింది. ఏటా ఈ పథకం కింద లబ్దిపొందే రైతుల సంఖ్య ఎక్కువవుతూ వస్తుంది. తాజాగా 19వ విడతలో దేశవ్యాప్తంగా 9.7 కోట్ల మంది రైతులు అర్హులుగా ఉన్నట్లు గుర్తించారు. ఇందులో ఏపీలోనే 42 లక్షల మంది వరకూ లబ్దిదారులున్నట్లు అంచనా. అనంతపురం జిల్లాలో అత్యధికంగా 2.85 లక్షల మంది ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి.
ఏపీలో అర్హులు...
కేంద్ర ప్రభుత్వం 2018 నుంచి ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం కింద ఎంతో కొంత ఉపయోగపడుతుందని భావించి మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేలా యాక్షన్ ప్లాన్ ను రూపొందించింది. వారికి అవసరమైన విత్తనాలు, పురుగు మందుల కొనుగోలుకు ఇది ఉపయోగపడుతుందని భావించింది. రైతుల సంక్షేమం కోసం తాము ఈ పథకాన్ని అందుబాటులోకి తెచ్చామని పేర్కొంది. ప్రారంభంలో కేవలం నాలుగు వేల రూపాయలుగా ఉన్న ఈ పథకం ఇప్పుడు ఆరు వేల రూపాయలకు చేరుకుంది. అయితే ప్రస్తుతానికి ఈ విడత తమ అన్నదాత సుఖీభవ పథకం కింద నిధులను ఏపీ ప్రభుత్వం జమ చేసే అవకాశాలు మాత్రం కనిపించడం లేదు. ఎందుకంటే బడ్జెట్ తర్వాతనే దీనిపై క్లారిటీ రానుంది.
Next Story