Thu Dec 26 2024 21:12:51 GMT+0000 (Coordinated Universal Time)
రైతులకు ఖాతాల్లో ఆ నిధులు జమ అయ్యేదెప్పుడంటే?
దేశంలో రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం కిసాన్ నిధులను విడుదల చేస్తామని అధికారులు తెలిపారు
దేశంలో రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైతుల ఖాతాల్లో డబ్బులు పడేది ఈ నెల 18వ తేదీ నుంచి అని ప్రభుత్వ అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే. విడతల వారీగా ఈ సొమ్మును అందచేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 18వ తేదీన రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం కింద తొలి విడతగా రెండు వేల రూపాయలను విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
18వ తేదీ నుంచి...
ఈ నెల 18వ తేదీన ఉత్తర్ప్రదేశ్ లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా రైతుల ఖాతాల్లో నగదును జమ చేసేలా అధికారులు ప్లాన్ చేశారు. పద్దెనిమిదో తేదీన రైతుల ఖాతాల్లో రెండు వేల రూపాయలు చొప్పున జమ అవుతాయని చెప్పారిు. ప్రధానిగా మోదీ బాధ్యతలను స్వీకరించిన తర్వాత తొలి సంతకం కూడా రైతుల పీఎం కిసాన్ నిధులు విడుదల ఫైలుపైనే పెట్టారు. ఇప్పటి వరకూ పెట్టుబడి సాయం కింద రైతులకు 3.04 లక్షల కోట్లను అర్హులైన రైతులకు అందించినట్లు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు.
Next Story