Sun Nov 24 2024 02:59:41 GMT+0000 (Coordinated Universal Time)
రైల్వే ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్
రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దీపావళికి 78 రోజుల బోనస్ ఇస్తున్నట్లు ప్రకటించింది
రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దీపావళికి 78 రోజుల బోనస్ ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే నాన్ గజిటెట్ ఉద్యోగులకు మాత్రమే ఈ బోనస్ ను కేంద్రం ప్రకటించింది. కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బోనస్ 11.27 లక్షల మంది ఉద్యోగులకు అందనున్నట్లు తెలిపింది. ఒక్కొక్కరికి గరిష్టంగా 17,951 రూపాయల బోనస్ అందనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఇందుకోసం 1,832 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు తెలిపింది.
చమురు సంస్థలకు...
మరోవైపు చమురు సంస్థలకు 22 వేల కోట్లు చెల్లించాలని కేంద్ర మంత్రి వర్గ సమావేశం నిర్ణయించింది. చమురు సంస్థలు భరించే సబ్సిడీ మొత్తాన్ని వారికి ఇవ్వాలని నిర్ణయించింది. 2020 జూన్ నుంచి 2022 జూన్ మధ్య గ్యాస్ సిలెండర్ ధరల కన్నా తక్కువ విక్రయించినందున ఆ మొత్తాన్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లకు చెల్లించాలని నిర్ణయించింది.
Next Story