Mon Dec 23 2024 08:40:52 GMT+0000 (Coordinated Universal Time)
Narendra Modi : మోదీ సర్కార్ గుడ్ న్యూస్.. మరో ఐదేళ్లు వారికి
రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేషన్ బియ్యాన్ని ఉచితంగా మరో ఐదేళ్లు అందిస్తామని పేర్కొంది
రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేషన్ బియ్యాన్ని ఉచితంగా మరో ఐదేళ్లు అందిస్తామని పేర్కొంది. ఈ మేరకు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. కరోనా క్లిష్ట సమయంలో గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం కింద రేషన్ కార్డులున్న వారందరికీ ఉచితంగా బియ్యం ఇస్తూ వస్తున్నారు. దీనిని మరో ఐదేళ్ల పాటు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనివల్ల దేశ వ్యాప్తంగా 81 కోట్ల మంది ప్రజలు లబ్ది పొందనున్నారని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
కేంద్ర మంత్రి వర్గం సమావేశమై...
కేంద్ర మంత్రి వర్గం ఈరోజు సమావేశమై ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఉచిత బియ్యం పంపిణీ పథకాన్ని 2028 డిసెంబరు నెల వరకూ పొడిగిస్తూ మోదీ సర్కార్ నిర్ణయం తీసుకుందని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. దీనివల్ల కేంద్ర ప్రభుత్వంపై 11.80 లక్షల కోట్ల భారం పడుతుందని పేర్కొన్నారు. ఈ పథకం డిసెంబరులో ముగియనుండటంతో కేంద్ర కేబినెట్ లో ఈ కీలక నిర్ణయానికి ఆమోదం లభించింది. దీంతో ఉచితంగా లబ్దిదారులు బియ్యాన్ని పొందే వీలుంది.
Next Story