Mon Dec 23 2024 00:57:12 GMT+0000 (Coordinated Universal Time)
Students : విద్యార్థులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్... చదువుకునేందుకు ఆర్థిక సాయం పొందడమెలా అంటే?
కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉన్నత విద్య కోసం ఆర్థిక సాయాన్ని పొందేందుకు అవకాశం కల్పించింది
కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఉన్నత విద్యను చదువుకోవడానికి ఆర్థిక సాయాన్ని పొందేందుకు అవకాశం కల్పించింది. విద్యా లక్ష్మీ పథకం ద్వారాకేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు ఆర్ధిక సహాయం అందించేందుకు ముందుకు వచ్చింది. ఉన్నత విద్యను అభ్యసించాలనుకునేవారు నిధుల లేమితో ఇబ్బంది పడకూడదని విద్యాలక్ష్మి పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ పథకం కింద విద్యార్థులు ఉన్నత విద్య కింద కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని విద్యాలక్ష్మి పథకం ద్వారా నిధులు అందుకోనున్నారు.
విద్యాలక్ష్మి ద్వారా...
విద్యా లక్ష్మి పోర్టల్ ద్వారా విద్యార్థులు రుణాలు, స్కాలర్ షిప్ లను పొందే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఈ పోర్టల్ ని ప్రోటీన్ ఎగోవ్ టెక్నాలజీ లిమిటెడ్ నిర్వహించింది. ఈ పోర్టల్ బ్యాంకులకు, విద్యార్థులకు మధ్యవర్తిగా పని చేయనుంది. కావున విద్యార్థులు సులువుగా రుణాలను పొందేందుకు అవకాశం ఉంది. ఇక విద్యా రుణం కోసం బ్యాంకుల చుట్టు విద్యార్థులు తిరగాల్సిన పనిలేకుండా ఈ పోర్టల్ ను రూపొందించింది. ఈ పోర్టల్ ద్వారా ఏ బ్యాంకు నుంచి అయినా రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులు ఈ పోర్టల్ లో బ్యాంకులు అందించే రుణంకి సంబంధించిన సమాచారం కూడా తెలుసుకోవచ్చు.
అర్హతలు ఇవే...
ఒకేసారి విద్యార్థులు ఇతర బ్యాంకులకు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. విద్యాలక్ష్మి పోర్టల్ లో దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఇండియన్ సిటిజన్స్ అయ్యి ఉండాలి. 12వ తరగతిలో ఉత్తీర్ణులై ఉండాలి. భారతదేశంలో లేక ఇతర దేశాలలో విద్యార్థులు చదువుకునేందుకు రుణాల కోసం దరఖాస్తులు చేసుకోవచ్చు.ఈ పోర్టల్ ద్వారా మీరు ఎటువంటి తనిఖీ లేకుండా నాలుగు లక్షల రూపాయల వరకు రుణాన్ని పొందవచ్చు. ఈ రుణం వడ్డీ రేటు 8.4 శాతం నుండి ప్రారంభమవుతుంది. ఈ రుణం మొత్తాన్ని కూడా 15 ఏళ్లలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. విద్య లక్ష్మి పోర్టల్ దరఖాస్తు చేసుకోవటానికి కేవైసీ పత్రాలు, గత ఆరు నెలల బ్యాంక్ పాస్ బుక్ స్టేట్ మెంట్, పది, పన్నెండో తరగతులు మార్క్ షీట్లు, గ్రాడ్యుయేషన్ కోర్సులు, ఫీజు వివరాలతో పాటు కాలేజీ లేక యూనివర్సిటీ అడ్మిషన్ కార్డు కాపీలు వంటివి పత్రాలు ఉండాలి. పూర్తి వివరాలకు https://www.vidyalakshmi.co.in/students ను చూసి మరిన్ని వివరాలను తెలుసుకోవచ్చు.
Next Story