Mon Nov 18 2024 00:19:12 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : భారీ ఊరట.. ఆదాయపు పన్ను పరిమితి 7 లక్షలు
కేంద్ర ప్రభుత్వం వేతన జీవులకు భారీ ఊరట కల్పించింది. ఏడు లక్షల ఆదాయం ఉన్న వారికి ఊరట కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం వేతన జీవులకు భారీ ఊరట కల్పించింది. ఏడు లక్షల ఆదాయం ఉన్న వారికి ఊరట కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నిర్మలా సీతారామన్ బడ్జెట్ సందర్భంగా లోక్సభలో చెప్పారు. ఏడు లక్షల ఆదాయం లోపు ఉన్న వారికి పన్ను నుంచి మినహాయింపు నిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆదాయపు పన్నుల శ్లాబులలో మార్పులు చేశారు. ఐదు లక్షల నుంచి ఏడు లక్షల వరకూ ఆదాయపు పన్ను పరిమితిని పెంచారు.
ఐదు శ్లాబ్ లలో...
ఏడు లక్షలు దాటితే ఐదు శ్లాబుల్లో పన్నులుంటాయని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. చిరు ఉద్యోగులకు, మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎనిమిదేళ్ల కాలంలో ఇంత భారీ స్థాయిలో మోదీ సర్కార్ ఆదాయపు పన్ను పరిమితిని పెంచడం ఇదే మొదటి సారి అని చెబుతున్నారు. పది లక్షల ఆదాయం దాటితే ముప్పయి శాతం పన్ను విధించనున్నట్లు ఆమె వెల్లడించారు. ఏడు లక్షల ఆదాయం ఉన్న వారు ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన పనిలేదు.
Next Story