Sat Dec 21 2024 00:11:43 GMT+0000 (Coordinated Universal Time)
అలాగయితే యాత్ర ఆపేయండి.. రాహుల్ కు కేంద్రం లేఖ
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కరోనా నిబంధనలను పాటించకపోతే యాత్ర ఆపేయాలని కోరింది
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కరోనా నిబంధనలను పాటించకపోతే యాత్ర ఆపేయాలని కోరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ రాహుల్ గాంధీకి, రాజస్థాన్ ముఖ్యమంత్రికి లేఖ రాశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రస్తుతం రాజస్థాన్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. యాత్రలో వేల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొంటున్నారు. రాహుల్ వెంట నడుస్తున్నారు.
వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లే...
భారత్ జోడో యాత్రలో ఖచ్చితంగా కరోనా నిబంధనలను పాటించాలని లేఖలో కేంద్ర ప్రభుత్వం కోరింది. మాస్కలను ప్రతి ఒక్కరూ ధరించాలని, శానిటైజర్లు వాడాలని పేర్కొంది. యాత్రలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారు మాత్రమే పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీని కోరారు. కరోనా నిబంధనలను పాటించకపోతే యాత్రను నిలిపివేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం సీరియస్ గానే లేఖలో పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ లేఖ రాయాల్సి వచ్చిందని ప్రభుత్వం తెలిపింది.
Next Story