Fri Dec 20 2024 05:12:37 GMT+0000 (Coordinated Universal Time)
ఇక ఆంక్షలు లేవ్.. అన్నీ తొలగించండి
కేంద్రప్రభుత్వం రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కరోనా ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కరోనా ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దేశంలో కరోనా కేసులు తగ్గడం, పాజిటివిటీ రేటు పూర్తిగా తగ్గడంతో కోవిడ్ ఆంక్షలను తొలగించాలని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ ఆంక్షలు రాష్ట్రాల్లో అమలులో ఉంటే వాటిని ఉపసంహరించుకోవాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖలో పేర్కొన్నారు.
కేసులు తగ్గుతుండటంతో.....
కరోనా కేసులు పెరుగుతుండటంతో అనేక రాష్ట్రాలు కరోనా ఆంక్షలు విధించాయి. నైట్ కర్ఫ్యూలు, షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లలో నిబంధనలను విధించాయి. మొన్నటి వరకూ కేరళ, తమిళనాడు, ఢిల్లీ, మహారాష్ట్ర వంటి ప్రాంతాల్లో ఆంక్షలు కొనసాగాయి. అయితే కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో క్రమంగా ఆంక్షలను సడలించుకుంటూ వచ్చాయి. అయితే టెస్ట్, ట్రాక్, ట్రీట్ తో పాటు వ్యాక్సినేషన్ ను కొనసాగించాలని ఆయన రాష్ట్రాలను కోరారు.
Next Story