Sat Nov 23 2024 04:40:32 GMT+0000 (Coordinated Universal Time)
ఐదు రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో కోవిడ్ ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో కోవిడ్ ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. అయితే ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తుంది. ప్రధానంగా హర్యానా, ఢిల్లీ, కేరళ, మహారాష్ట్ర, మిజోరాంలలో గత వారం రోజుల నుంచి కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఆ యా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం అలెర్ట్ జారీ చేసింది. కోవిడ్ ఆంక్షలను విధించకపోయినా టెస్ట్, ట్రేస్, ట్రీట్మెంట్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని కోరింది.
కరోనా కేసులు .....
కేరళలో ఒక్క వారం రోజులలోనే 2,321 కేసులు నమోదయ్యాయి. పాజటివిటీ రేటు కూడా పెరిగడం ఆందోళన కల్గిస్తుందని కేంద్ర ప్రభుత్వం రాసిన లేఖలో పేర్కొంది. అవసరమైతే కోవిడ్ నిబంధనలను కట్టుదిట్టం చేయాలని సూచించింది. ముందస్తు చర్యలు తీసుకోకపోతే ముప్పు తప్పదని ఆ ఐదు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది.
Next Story