Mon Dec 23 2024 02:35:49 GMT+0000 (Coordinated Universal Time)
కోవిడ్ కొత్త వేరియంట్‌పై కేంద్రం మార్గదర్శకాలు
కోవిడ్ కొత్త వేరియంట్ పై రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది
కోవిడ్ కొత్త వేరియంట్ పై రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. టెస్ట్, ట్రాక్, ట్రీట్ లపై దృష్టి పెట్టాలని కోరింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాసింది. వ్యాక్సినేషన్ ను సత్వరం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
వ్యాక్సినేషన్ ను...
రాష్ట్రాలు మళ్లీ వ్యాక్సినేషన్ ను వేగవంతంగా చేపట్టాలని కోరింది. పండగలు వస్తున్నందున కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా అమలయ్యేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ప్రజలు కూడా భౌతికదూరాన్ని పాటిస్తూ మాస్క్ లను విధిగా ధరించాలని కోరింది. ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటే కోవిడ్ ను నియంత్రించవచ్చని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది.
Next Story