Fri Mar 28 2025 21:50:29 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : నకిలీ ఓటర్లకు షాక్.. ఆధార్ కార్డుతో ఓటరు ఐడీ లింక్
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓటర్ ఐడీ కార్డుకు ఆధార్ నెంబరును అనుసంధానం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓటర్ ఐడీ కార్డుకు ఆధార్ నెంబరును అనుసంధానం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో కేంద్ర ఎన్నికల కమిషన్ ఆధార్ తో ఓటర్ ఐడీ అనుసంధాన్ ప్రక్రియను ప్రారంభించింది. దేశమంతా ఈ ప్రక్రియను ఎన్నికల కమిషన్ అత్యంత వేగంగా జరపాలని నిర్ణయించింది.
పోలింగ్ కేంద్రంలో...
దీనివల్ల దొంగ ఓట్లను పోల్ చేయడానికి వీలు ఇక ఉండదని కేంద్ర ఎన్నికల కమిషన్ అభిప్రాయపడుతుంది. ఆధార్ కార్డుతో పాటు ఓటర్ ఐడీ అనుసంధానమయితేనే ఓటింగ్ కు ఇక అనుమతించనున్నారు. దీనివల్ల దొంగ ఓట్లు, రిగ్గింగ్ వంటివి జరగకుండా ఎన్నికలు పారదర్శకంగా జరిపేందుకు ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం ప్రశంసలను అందుకుంది.
Next Story