Thu Dec 12 2024 21:40:48 GMT+0000 (Coordinated Universal Time)
Diesel and Pertrol Rates : త్వరలోగుడ్ న్యూస్... పెట్రోల్ ధరలు తగ్గింపు?
కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. త్వరలో డీజిల్, పెట్రోల్ ధరలను తగ్గించాలని నిర్ణయించినట్లు సమాచారం.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. త్వరలోనే డీజిల్, పెట్రోల్ ధరలను తగ్గించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు తెలిసింది. జమిలి ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రజల్లో కనిపిస్తున్న వ్యతిరేకతను తగ్గించుకోవడానికి పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని దాదాపుగా నిర్ణయించినట్లు తెలిసింది. పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. దీని ప్రభావం పేద, మధ్య తరగతి ప్రజలపై భారం పడుతుంది. నెలవారీ ఖర్చులు కూడా పెట్రోల్ ధరల పెంపుదల కారణంగానే పెరిగిపోయినట్లు ప్రజలు అభిప్రాయపడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.
నిత్యావసరాల ధరలు...
కూరగాయల నుంచి నిత్యవసరాల వస్తువుల ధరలు విపరీతంగా పెరగడానికి పెట్రోలుధరలు పెరగడమే కారణమని వేరే చెప్పాల్సినపనిలేదు. ప్రజలు బయటకు అడుగు పెట్టాలన్నా ఇప్పుడు వాహనం అనివార్యమవుతుంది. వాహనాల సంఖ్య కూడా విపరీతంగా పెరగడమే ఇందుకు నిదర్శనం. వాహనాల నిర్వహణ కూడా పెట్రోలు ధరల వల్ల మరింత భారంగా మారిందని పేద, మధ్యతరగతి ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం మార్చిలో పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించింది. లీటరుపై రెండు రూపాయలు తగ్గించింది. అంతకు ముందు ఇరవై రూపాయల వరకూ దశల వారీగా పెంచిన ప్రభుత్వం తర్వాత క్రమంగా తగ్గించుకుంటూ వచ్చింది. కొన్ని రాష్ట్రాలు తమ పన్ను శాతాన్ని కొంత తగ్గించుకున్నాయి.
విండ్ ఫాల్ ట్యాక్స్....
క్రూడాయిల్ ధరలు తగ్గడంతో పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలన్న అభిప్రాయంలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. దేశీయంగా ఉత్పత్తి చేస్తున్న ముడి చమురుపై విధిస్తున్న విండ్ ఫాల్ ట్యాక్స్ ను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రానున్న రోజుల్లోనే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ ధరలు దిగివచ్చే అవకాశం ఎక్కువగా ఉందని నిపు ణులు సైతం చెబుతున్నా రు. త్వరలో జమిలి ఎన్నికలు కూడా జరుగుతుండంటంతో కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా పెట్రో ఉత్పత్తి ధరలు తగ్గించేందుకు అవకాశాలున్నాయి. అలాగే గ్యాస్ ధరలను కూడా తగ్గించే ఛాన్స్ ఉందని ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
Next Story