Mon Dec 23 2024 23:14:01 GMT+0000 (Coordinated Universal Time)
బర్డ్ ఫ్లూ ప్రమాదం పొంచి ఉంది.. హై అలర్ట్
దేశంలో బర్డ్ ఫ్లూ విస్తరించే అవకాశముందని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను హెచ్చరించింది
దేశంలో బర్డ్ ఫ్లూ విస్తరించే అవకాశముందని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను హెచ్చరించింది. ఏవియన్ ఇన్ఫ్లూఎంజాను బర్డ్ ఫ్లూ అని కూడా పిలుస్తారు. పక్షులు, కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాది సోకుతుందని చెబుతున్నారు. కోళ్లు గాని, పక్షులు గాని అసాధారణ సంఖ్యలో మరణిస్తే దానిని బర్డ్ ఫ్లూ గా భావించి అప్రమత్తం కావాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. కోళ్ల ఫారాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అందుకు అప్రమత్తత అవసరమని కూడా తెలిపింది.
నాలుగు రాష్ట్రాల్లో...
ఈ వ్యాధి పక్షుల నుంచి మనుషులకు కూడా సంక్రమించే అవకాశముందని, దీనికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం అవసరమని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ వ్యాధిని కనుగొన్నట్లు తెలిపింది. దీంతో ఆ రాష్ట్రాలతో పాటు మిగిలిన రాష్ట్రాలు కూడా అలెర్ట్ గా ఉండాలని ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం నుంచి వెలువడ్డాయి.
Next Story