Fri Nov 15 2024 02:00:57 GMT+0000 (Coordinated Universal Time)
కేంద్రం కొత్త మెలిక.. రాష్ట్రాలకు ఝలక్
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల ప్రయోజనాల్లో కోత విధించడమే కాదు. ఇక ప్రాజెక్టుల విషయంలోనూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు వచ్చే ప్రయోజనాల్లో కోత విధించడమే కాదు. ఇక ప్రాజెక్టుల విషయంలోనూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ఏ సాగునీట ిప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇస్తే కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులను మాత్రమే ఇస్తుందని స్పష్టం చేసింది. ఆ ప్రాజెక్టుకు అయ్యే వ్యయంలో నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సిందేనని పేర్కొంది. దీంతో పాటు మరో మెలిక కూడా పెట్టింది.
ఇక కష్టమే....
తొలుత ప్రాజెక్టుకు అయ్యే వ్యయంలో నలభై శాతం నిధులను విడుదల చేసి ఖర్చు చేస్తేనే కేంద్ర ప్రభుత్వం తన వాటా నిధులను విడుదల చేయనుంది. ఈ మేరకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కొత్త నిబంధనలను విడుదల చేసింది. అయితే ఇప్పటి వరకూ జాతీయ హోదా కల్పించిన ప్రాజెక్టులకు 90 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. ఇందులో 30 శాతం నిధులకు కోత పెట్టింది. దీంతో ఇకపై రాష్ట్రాల ప్రాజెక్టులకు జాతీయ హోదా దక్కాలంటే ఇక కష్టమే.
Next Story