Sat Apr 05 2025 04:37:33 GMT+0000 (Coordinated Universal Time)
Jamili Elections : జమిలి ఎన్నికలపై తాజా అప్ డేట్ ఇదే
జమిలి ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లే కనిపిస్తుంది.జనగణన కూడా వెంటనే పూర్తి చేయాలని నిర్ణయించింది

జమిలి ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లే కనిపిస్తుంది. 2027 నాటికి దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం. జమిలి ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే రామ్ నాథ్ కోవింద్ ఇచ్చిన కమిటీ నివేదికను కేంద్ర మంత్రి వర్గం ఆమోదించింది. వచ్చే లోక్ సభ సమావేశాల్లో ఈ జమిలీ ఎన్నికలపై బిల్లు పెట్టే అవకాశముందని తెలిసింది. జమిలి ఎన్నికలను నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ పట్టుదలతో ఉన్నారు. అంతే కాదు మరోసారి బీజేపీని కేంద్రంలో అధికారంలోకి తీసుకు రావాలని భావిస్తున్నారు.
జనగణన కూడా...
మరోవైపు దేశ వ్యాప్తంగా జనగణన కూడా చేయాలని, దానిని వేగవంతంగా పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెబుతున్నారు. 2025 నుంచి జనాభా లెక్కల సేకరణకు సిద్ధమయింది. 2026 నాటికల్లా జనగణను దేశ వ్యాప్తంగా పూర్తి చేయడమే కాకుండా పార్లమెంటు సభ్యుల సంఖ్యను కూడా పెంచేలా నిర్ణయం తీసుకోనున్నారు. ఈ లెక్క ప్రకారం దక్షిణాదిన లోక్సభ స్థానాలు తగ్గుతుండగా, ఉత్తర భారతదేశంలో సీట్ల సంఖ్య పెరిగే అవకాశముంది. జనగణన పూర్తయి, పార్లమెంటు నియోజకవర్గాల విభజన జరిగిన తర్వాత 2027 నాటికి జమిలి ఎన్నికలకు వెళ్లాలన్న నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వం ఉంది.
Next Story