Mon Dec 23 2024 14:46:57 GMT+0000 (Coordinated Universal Time)
కేంద్రమంత్రి రాజ్ నాథ్ కు కరోనా పాజిటివ్ !
సెలబ్రిటీలు, వీఐపీలన్న బేధం లేకుండా.. దొరికిన వాళ్లందరిపై మాయదారి వైరస్ దాడి చేస్తోంది. ఇప్పటికే పార్లమెంట్ లో 400 మందికి కోవిడ్ సోకగా.. 300 మంది
దేశంలో కోవిడ్ థర్డ్ వేవ్ ఎఫెక్ట్ భారీగానే కనిపిస్తోంది. మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాలతో పాటు.. అనేక రాష్ట్రాల్లో వైరస్ తీవ్రత తారాస్థాయిలో ఉంది. సామాన్యులు, సెలబ్రిటీలు, వీఐపీలన్న బేధం లేకుండా.. దొరికిన వాళ్లందరిపై మాయదారి వైరస్ దాడి చేస్తోంది. ఇప్పటికే పార్లమెంట్ లో 400 మందికి కోవిడ్ సోకగా.. 300 మంది పోలీసులు కూడా కరోనా బారిన పడ్డారు.
తాజాగా కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే వెల్లడించారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో.. కోవిడ్ నిర్థారణ పరీక్షలు చేయించుకోగా.. పాజిటివ్ గా తేలిందన్నారు. ప్రస్తుతం హోం క్వారంటైన్ లోనే ఉన్నానని తెలిపారు. కాగా.. ఇటీవలి కాలంలో తనను కలిసినవారంతా కోవిడ్ టెస్టులు చేయించుకుని, కొద్దిరోజులు ఐసోలేషన్ లో ఉండాలని రాజ్ నాథ్ విజ్ఞప్తి చేశారు.
Next Story