Mon Dec 23 2024 16:21:22 GMT+0000 (Coordinated Universal Time)
కాబోయే అల్లుడికి మంత్రి స్మృతి ఇరానీ వార్నింగ్..!
కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కాబోయే అల్లుడికి సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ ఇచ్చారు. మామగా క్రేజీ వ్యక్తినైతే ఎంచుకున్నావ్ కానీ.. నాలాంటి అత్తతో కాస్త జాగ్రత్తగా
కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కాబోయే అల్లుడికి సోషల్ మీడియా వేదికగా వార్నింగ్ ఇచ్చారు. మామగా క్రేజీ వ్యక్తినైతే ఎంచుకున్నావ్ కానీ.. నాలాంటి అత్తతో కాస్త జాగ్రత్తగా ఉండాలంటూ కాబోయే అల్లుడు అర్జున్ భల్లాకు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా స్మృతి ఇరానీ తన కూతురు షానెల్లి ఎంగేజ్మెంట్ విషయాన్ని ఇన్ స్టా వేదికగా వెల్లడించారు. షా నెల్లి నిశ్చితార్థం తన బాయ్ ఫ్రెండ్ అర్జున్ భల్లాతో నిశ్చితార్థం జరిగిందని పేర్కొంటూ.. మోకాళ్లపై కూర్చుని కాబోయే భార్యకు అర్జున్ రింగ్ తొడుగుతున్న ఫోటోను మంత్రి ఇరానీ తన ఇన్ స్టా లో పోస్ట్ చేశారు. ఆ పోస్టుకు ఒక ఇంట్రెస్టింగ్ ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారామె.
స్వీట్ వార్నింగ్
మా లాంటి గుండె కలిగిన కుటుంబంలోకి వస్తున్న అర్జున్ భల్లాకు స్వాగతం అని రాసుకొచ్చారు. తన పోస్టులో అల్లుడు అర్జున్ను సరదాగా హెచ్చరించారు. అఫీషియల్‌గా వార్నింగ్ ఇస్తున్నానని.. దేవుడు మిమ్మల్ని దీవించాలని కోరుతున్నట్లు తన పోస్టులో మంత్రి స్మృతి ఇరానీ సరదా కామెంట్స్ పెట్టారు. కాగా.. స్మృతి ఇరానీ భర్త జుబిన్ ఇరానీ మొదటి భార్య మోనా ఇరానీ కూతురే షానెల్లి. షానెల్లికి స్మృతి ఇరానీ స్టెప్ మదర్ అయినప్పటికీ.. సొంత కూతురు మాదిరిగానే చూసుకుంటారు. స్మృతి ఇలా ఫొటోను పోస్ట్ చేశారో లేదో.. నెటిజన్లు లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాబోయే వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Next Story