టీవీల్లో, వెబ్‌సైట్స్ లో ఇకపై అలాంటి యాడ్స్ కనిపించకూడదు
డిజిటల్ మీడియా, OTT ప్లాట్‌ఫారమ్‌లకు కూడా మంత్రిత్వ శాఖ ఇదే విధమైన ఆదేశాలను జారీ చేసింది. అలాంటి ప్రకటనలతో
బెట్టింగ్ లు ఎంకరేజ్ చేయకుండా ఉండేలా కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలను జారీ చేసింది. బెట్టింగ్ సైట్స్, యాప్ లకు సంబంధించిన ప్రకటనలను ప్రజల దాకా వెళ్లకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా కీలక ఆదేశాలను జారీ చేసింది. దేశంలోని న్యూస్ సైట్స్, ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ సంస్థలకు బెట్టింగ్ యాడ్స్ ప్రదర్శించకూడదని కేంద్ర ఇన్ఫర్మేషర్, బ్రాడ్‌కాస్టింగ్ మంత్రిత్వశాఖ సరికొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆయా రంగాల్లోని సంస్థలు ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫార్మ్‌లకు సంబంధించిన ప్రకటనలను ప్రదర్శించవద్దని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు మార్గదర్శకాలను వార్త వెబ్సైట్లు, ఓటీటీ ఫ్లాట్ఫార్మ్, ప్రైవేట్ శాటిలైట్ ఛానెల్స్, సోషల్ మీడియా సంస్థలకు అందించింది. ఆన్లైన్, ఆఫ్‌లైన్ బెట్టింగ్ ప్లాట్ఫార్మ్, వాటి సంబంధిత ప్రకటనలను ఎట్టిపరిస్థితుల్లో ప్రకటించవద్దని ప్రైవేట్ శాటిలైట్ టెలివిజన్ ఛానెళ్లను కోరుతున్నామని మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతేకాకుండా ఈ ఛానెళ్లకు సంబంధించిన వెబ్సైట్లు లేక ఇతర ఫ్లాట్‌ఫార్మ్‌లలో కూడా బెట్టింగ్‌కు ప్రోత్సహించే విధంగా ఎటువంటి ప్రకటన, వార్త ప్రచురితం కాకూడదని ఆదేశాల్లో పేర్కొంది. ఈ విషయంలో ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరికలు జారీ చేసింది. ఇకపై అలాంటి యాడ్స్ ప్రదర్శించడం మానుకోవాలని కేంద్రం ఆదేశాలిచ్చింది.