Mon Mar 31 2025 20:35:48 GMT+0000 (Coordinated Universal Time)
గూగుల్ నుంచి మరో పదివేల మంది అవుట్
గూగుల్ లో మరిన్ని లేఆఫ్స్ ఉంటాయని సీఈవో సుందర్ పిచాయ్ పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు.

గూగుల్ లో మరిన్ని లేఆఫ్స్ఉంటాయని సీఈవో సుందర్ పిచాయ్ పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. ఇప్పటికే 12 వేల మందిని గూగుల్ తమ సంస్థ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. సంస్థను ఆర్థికంగా బయటపడేయటానికి భారంగా మారిన ఉద్యోగులను గూగుల్ సంస్థ ఇంటికి పంపుతుంది. ఇపస్పుడు రెండో రౌండ్ లేఆఫ్స్ ఉంటాయని సుందర్ పిచాయ్ ప్రకటించడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. దాదాపు పది వేల మంది ఉద్యోగులను ఈసారి ఇంటికి పంపే అవకాశం ఉందని చెబుతున్నారు.
భరించలేకనే...
తొలి విడతలో గూగుల్ సంస్థ పన్నెండు వేల మందిని తొలగించింది. ఈ ఊఏడాది జనవరిలో గూగుల్ ప్రకటించింది. ఇప్పుడు రెండో విడత లేఆఫ్స్ ఉంటాయని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. కంపెనీ సామర్థ్యాన్ని పెంచుకోవాలంటే అదనపు భారాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. టెక్నికల్ గా అనుభవం ఉన్న వారికి ఎలాంటి సమస్య ఉండదని, ప్రాథమిక దశలో ఉన్నవారిని భరించడం మాత్రం కష్టమని అన్నారు. గూగుల్ ఎదిగేందుకు, కంపెనీలో పని చేసేందుకు చాలా అవకాశాలను సంస్థ ఇచ్చిందని, ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోతే అది గూగుల్ తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు.
Next Story