Thu Dec 19 2024 19:13:56 GMT+0000 (Coordinated Universal Time)
Chandipura Virus: చాందిపుర వైరస్ అంటే ఏంటి? ఎలా సోకుతుందో తెలుసా?
గుజరాత్ ను చాందిపుర వైరస్ వణికిస్తుంది. ఇప్పటికే ఎనిమిది మంది చిన్నారులు ప్రాణాలు వదిలారు.
గుజరాత్ ను చాందిపుర వైరస్ వణికిస్తుంది. ఇప్పటికే ఎనిమిది మంది చిన్నారులు ప్రాణాలు వదిలారు. దీంతో అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. గుజరాత్ లో బయటపడిన ఈ వైరస్ తో మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఆందోళన కలుగుతుంది. ఈ వైరస్ దోమలు, రెక్కల పురుగుల ద్వారా సంక్రమిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. వైరస్ సోకిన వారికి ఫ్లూ వంటి లక్షణాలుంటాయని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధి సోకిన వారిలో ఎక్కువ మంది చిన్నారులు కావడంతో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటంతో మరణాల సంఖ్య ఎక్కువగా ఉందని వైద్యులు కూడా చెబుతున్నారు.
ఫ్లూ వంటి లక్షణాలతో...
గుజరాత్ లోని సబర్కాంత్, ఆరావళి, మహిసాగర్, ఖఏడా, మెహసానా, రాజ్కోట్ జిల్లాల్లో ఈ చాందిపుర వైరస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మొత్తం పథ్నాలుగు మందికి ఈ వైరస్ సోకగా ఇప్పటికే ఎనిమిది మంది మరణించడంతో మరణాల రేటు ఎక్కువగా ఉందని చెప్పొచ్చుక. సరైన సమయంలో వైద్యం అందకపోతే మరణం తప్పదని వైద్యులు చెబుతున్నారు. ఏమాత్రం ఫ్లూ వంటి లక్షణాలు కనిపించినా వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటికే గుజరాత్ ప్రభుత్వం ఈ చాందీపుర వైరస్ పై హై అలెర్ట్ ప్రకటించింది. ఈ వైరస్ కేసులకు చికిత్స అందించేందుకు ఎక్కడికక్కడ ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. ఈ వ్యాధి లక్షణాలున్న వారి రక్త నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపినట్లు వైద్యులు తెలిపారు. ఫలితాల కోసం తాము ఎదురు చూస్తున్నామని చెప్పారు.
హై అలెర్ట్....
గుజరాత్ కే పరిమితమైన ఈ చాందిపుర వైరస్ మిగిలిన రాష్ట్రాల్లో సంక్రమించకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాల అధికారులను ఆదేశాలు జారీ చేసింది. అనుమానిత కేసులు ఏమైనా ఉంటే వెంటనే చికిత్స చేసేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. అవసరమైన పరీక్షలు చేయడానికి కూడా రాష్ట్రాలు ఏర్పాటు చేసుకుంటే మంచిదని చెబుతున్నారు. ఈ వైరస్ అత్యంత వేగంగా విస్తరిస్తుండటంతో ప్రమాదరకమైనదిగా మారడంతో పాటు మరణాల సంఖ్య కూడా ఎక్కువగా ఉండటంతో నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తూ పరిస్థితిని ఎప్పటికిప్పుడు అంచనా వేసుకుంటూ తగిన మందస్తు చర్యలు తీసుకోవాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.
Next Story