Mon Dec 23 2024 06:47:58 GMT+0000 (Coordinated Universal Time)
బద్రీనాథ్ హైవే మూసివేత.. నిలిచిన చార్ ధామ్ యాత్ర
చార్ ధామ్ యాత్రకు వచ్చిన భక్తులు.. కేదార్ నాథ్, బద్రీనాథ్ లలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండటంతో ఇబ్బందులు ..
ఉత్తరాఖండ్ లోని చమోలి సమీపంలో ఉన్న పర్వతం నుండి శిథిలాలు కింద పడుతుండటంతో బద్రీనాథ్ హైవే తాత్కాలికంగా మూతపడింది. కొండ శిథిలాలు విరిగి రోడ్డుపై పడటంతో అధికారులు బద్రీనాథ్ హైవేను మూసివేశారు. దాంతో చార్ ధామ్ యాత్రకు అంతరాయం కలిగింది. చమోలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్వాలి చమోలి ప్రాంతంలోనే బజ్ పూర్ లో పర్వతం నుండి శిథిలాలు పడటంతో బద్రీనాథ్ హైవే మూతపడింది. దాంతో ఆ దారిమీదుగా వెళ్లే వాహనాలు నిలిచిపోయాయి.
చార్ ధామ్ యాత్రకు వచ్చిన భక్తులు.. కేదార్ నాథ్, బద్రీనాథ్ లలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉండటంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో శ్రీనగర్ పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా చార్ ధామ్ యాత్రను నిలిపివేశారు. ఇప్పటికే చార్ ధామ్ యాత్రకై శ్రీనగర్ చేరుకున్నవారి కోసం బస ఏర్పాటు చేశారు. ప్రస్తుతం బద్రీనాథ్ లో కొండచరియలు విరిగి పడటంతో పాటు మంచుకూడా కురుస్తోంది. రేపు కూడా అక్కడ వర్షం, మంచు కురిసే అవకాశాలున్నట్లు భారత వాతావరణశాఖ తెలిపింది. వాతావరణం అనుకూలంగా మారగానే యాత్రికులకు అనుమతిస్తారు.
Next Story