Mon Dec 23 2024 06:56:34 GMT+0000 (Coordinated Universal Time)
చార్ ధామ్ యాత్రలో ఇద్దరు మృతి.. ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి
ఉత్తరాఖండ్ చార్ ధామ్ యాత్రకు వచ్చే యాత్రికులు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని అధికారులు మొదటి నుండి చెబుతూనే..
చార్ ధామ్ యాత్రలో ఇద్దరు వ్యక్తులు గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని స్థానిక అధికారులు అధికారికంగా ధృవీకరించారు. చార్ ధామ్ యాత్రకు వచ్చే యాత్రికులకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం జారీ చేసిన సలహాలను పట్టించుకోవడం లేదు. 55 ఏళ్లు బడిన యాత్రికులకు ఆరోగ్య పరీక్షలు తప్పనిసరిగా చేయాలని సూచించినా.. యాత్రికులు నిర్లక్యంగా ఉంటున్నారని అధికారులు పేర్కొన్నారు. నిర్లక్ష్యం కారణంగానే యమునోత్రిలో ఇద్దరు యాత్రికులు గుండెపోటుతో మరణించారన్నారు.
ఉత్తరాఖండ్ చార్ ధామ్ యాత్రకు వచ్చే యాత్రికులు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని అధికారులు మొదటి నుండి చెబుతూనే ఉన్నారు. కరోనా తర్వాతి నుండి ఆరోగ్య పరీక్షలను తప్పనిసరి చేశారు. అయినా చాలామంది యాత్రికులు ఆరోగ్యం బాలేకపోయినా యాత్రను కొనసాగిస్తుండటంతో విషాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఏప్రిల్ 22, 2023 అక్షయ తృతీయ రోజు నుండి మొదలైన ఈ యాత్ర నవంబర్ 21, 2023 వరకూ కొనసాగనుంది. ఈ యాత్రలో కేదార్ నాథ్, బదరీ నాథ్, గంగోత్రి, యమునోత్రి ప్రాంతాలను సందర్శిస్తారు.
Next Story