Sat Nov 23 2024 05:33:44 GMT+0000 (Coordinated Universal Time)
శృంగారంపై ఛత్తీస్ఘడ్ కోర్టు సంచలన తీర్పు
ఛత్తీస్ ఘడ్ కోర్టు సంచలన తీర్పు నిచ్చింది. శృంగారాన్ని నిరాకరించడం కూడా క్రూరత్వమేనని పేర్కొంది.
ఛత్తీస్ ఘడ్ కోర్టు సంచలన తీర్పు నిచ్చింది. శృంగారాన్ని నిరాకరించడం కూడా క్రూరత్వమేనని పేర్కొంది. వెంటనే ఆ దంపతులకు విడాకులు మంజూరు చేసింది. భార్యాభర్తల విడాకుల కేసులో ఛత్తీస్ఘడ్ కోర్టు ఈ మేరకు తీర్పు చెప్పింది. తన భార్య తనతో కలిసేందుకు ఇష్టపడటం లేదని, శృంగారానికి అంగీకరించడం లేదంటూ ఒక వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తనకు భార్యతో విడాకులు ఇప్పించాలని వేడుకున్నాడు.
విడాకులు మంజూరు....
దీనిపై విచారించిన ఛత్తీస్ఘడ్ కోర్టు వెంటనే ఆ దంపతులకు విడాకులు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. శృంగారాన్ని నిరాకరించం కూడా క్రూరత్వమేనని అభిప్రాయడింది. భార్యా భర్తల మధ్య సంబంధం ఆరోగ్యకరంగా ఉండాలని, శృంగారం కూడా వైవాహిక జీవితంలో ఒక ముఖ్యమైన భాగమని కోర్టు అభిప్రాయపడింది.
Next Story