Mon Mar 24 2025 08:05:33 GMT+0000 (Coordinated Universal Time)
చెన్నైలో ప్రయాణికులకు సూపర్ న్యూస్
చెన్నై లో ప్రయాణికులకు మెట్రో సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఐపీఎల్ సీజన్ లో ప్రయాణికులందరికీ చెన్నైలో ఉచిత ప్రయాణాన్ని కల్పించింది

చెన్నై లో ప్రయాణికులకు మెట్రో సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. ఐపీఎల్ సీజన్ లో ప్రయాణికులందరికీ చెన్నైలో ఉచిత ప్రయాణాన్ని కల్పించింది. క్రికెట్ మ్యాచ్ లు చూసే ప్రతి వీక్షకుడికి చెన్నై సూపర్ కింగ్స్ తో చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఐపీఎల్ లో జరిగే ప్రతి మ్యాచ్ కు వెళ్లే ప్రేక్షకుడికి ఉచిత ప్రయాణం అందించనుంది. మెట్రో స్టేషన్ నుంచి గవర్నర్ మెంట్ ఎస్టేట్ వరకూ రాను పోను మెట్రో రైలు సేవలు వినియోగించుకోవచ్చు.
ఉచిత ప్రయాణం...
అయితే ఈ ఉచిత ప్రయాణ సదుపాయం మ్యాచ్ లు ఉన్న రోజులు మాత్రమే జరగనున్నాయి. రాను పోను మెట్రో రైలు సేవలు వినియోగించుకోవచ్చని అధికారులు తెలిపారు. మ్యాచ్ జరిగిన రోజు మాత్రం అర్ధరాత్రి ఒంటి గంట వరకూ మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికుల డిమాండ్ ను బట్టి మెట్రో రైలు సేవల వేళలను ప్రకటించనున్నారు.
Next Story