Sun Mar 30 2025 20:18:41 GMT+0000 (Coordinated Universal Time)
మెట్రో రైళ్ల వేళల పొడిగింపు
రేపు భారత్ - ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టీ 20 మ్యాచ్ కోసం చెన్నై మెట్రో రైలు సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.

రేపు భారత్ - ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టీ 20 మ్యాచ్ కోసం చెన్నై మెట్రో రైలు సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్ల వేళలను పొడిగించాలని నిర్ణయం తీసుకుంది. మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమై రాత్రి పదకొండు గంటల వరకూ జరిగే అవకాశముంది. స్టేడియం నుంచిబయటకు వచ్చి గమ్యస్థానాలకు చేరేందుకు మరింత సమయాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.
సమయం పొడిగింపు...
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య శనివారం చేపాక్‌లోని ఎంఏ చిదంబరం క్రికెట్ మైదానంలో మ్యాచ్ జరుగుతున్న కారణంగా మెట్రో సర్వీసులను తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (టీఎన్‌సీఏ) సూచనతో పొడిగించినట్టు సీఎంఆర్ఎల్ గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే మ్యాచ్ టిక్కెట్ కొనుగోలు చేసిన వారికి ఉచిత ప్రయాణం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
Next Story