Mon Dec 23 2024 04:47:14 GMT+0000 (Coordinated Universal Time)
ఆహారం అందించండి సారూ!!
మిచాంగ్ తుఫాను కారణంగా చెన్నై మహానగరం అతలాకుతలం అయింది
మిచాంగ్ తుఫాను కారణంగా చెన్నై మహానగరం అతలాకుతలం అయింది. దక్షిణ చెన్నైలోని చాలా వీధులు నీట మునిగిన సంగతి తెలిసిందే!! వేలాది మంది నిత్యావసరాలు లేక, విద్యుత్ లేక ఇబ్బందులు పడుతున్నారు. అపార్ట్మెంట్లలో చిక్కుకున్న వృద్ధులు, పిల్లలను రక్షించడానికి పడవలను మోహరించారు. పళ్లైకరనై, పెరుంబాక్కం, షోలింగనల్లూర్, కరపాక్కం, మేడిపాక్కం, రామ్ నగర్లతో సహా చెన్నైలోని వెలచ్చేరి ప్రాంతంలోని నివాసితులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. నిత్యావసరాలు, ఆహారం, తాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నారు. గేటెడ్ కమ్యూనిటీలలోకి నీరు పెద్ద ఎత్తున చేరడంతో బయటికి వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇక చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల్లో పాల సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది.
ఇక చెన్నై ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి. హీరో విశాల్ కూడా తమిళనాడు ప్రభుత్వంపై మండిపడ్డారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెన్నై మేయర్ ప్రియా రాజన్, గ్రేటర్ చెన్నై కార్పోరేషన్ కమిషనర్, ఇతర అధికారులు.. మీరంతా క్షేమంగా ఉన్నారా? మీ ఇంట్లోకి డ్రైనేజీ నీళ్లు రాలేదు కదా? నిత్యావసర సరుకులు మీ ఇంటికే వస్తున్నాయ్ కదా? అని సామాన్యులకు ఎదురవుతున్న సమస్యలపై కౌంటర్ల మీద కౌంటర్లు వేశాడు విశాల్. ఎంతో మంది తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన సినీ ప్రముఖులు కూడా తుపాను కారణంగా ఇబ్బందులు పడ్డారు.
Next Story