Mon Apr 07 2025 22:29:39 GMT+0000 (Coordinated Universal Time)
నడిరోడ్డుపై జుట్లు పట్టుకుని కొట్టుకున్న విద్యార్థినులు. వీడియో వైరల్
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. పుదురామకృష్ణాపురంలోని

పాఠశాల విద్యార్థినులు విచక్షణ మరచి.. నడిరోడ్డుపై జుట్టు..జుట్టు పట్టుకుని కొట్టుకున్న ఘటన చెన్నైలోని పెరంబూర్ లో తాజాగా వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. పుదురామకృష్ణాపురంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 600 మంది విద్యార్థులు చదువుతున్నారు. సోమవారం (మార్చి 27) సాయంత్రం ప్లస్ వన్ చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు రోడ్డుపై గొడవ పడటంమొదలుపెట్టారు.
వీరిద్దరిలో ఓ బాలిక తన సహచర విద్యార్థిని ప్రేమిస్తోంది. అతనికి మరో బాలిక వాట్సాప్ లో మెసేజ్ పంపడమే వారిద్దరి మధ్య గొడవకు కారణమైనట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య వాగ్యుద్ధం పెద్దదై.. జుట్లు పట్టుకుని కొట్టుకునేంతవరకూ వెళ్లింది. ఆపాల్సిన వారిద్దరి స్నేహితులు కూడా వారికి జతకూడారు. రెండు గ్రూపులుగా విడిపోయి తీవ్రంగా కొట్టుకున్నారు. ఈ వ్యవహారం పాఠశాల ప్రధానోపాధ్యాయుడి దృష్టికి వెళ్లడంతో .. వారు విద్యార్థులను విచారిస్తున్నారు.
Next Story