Fri Nov 22 2024 20:25:56 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : కేజ్రీవాల్‌కు బిగ్ రిలీఫ్
సుప్రీంకోర్టులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. ప్రభుత్వాలు, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ల అధికారాలపై తీర్పు చెప్పింది
సుప్రీంకోర్టులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. ప్రభుత్వాలు, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ల అధికారాలపై సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీనిపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు చెప్పింది. ప్రభుత్వ అధికారాలపై నియంత్రణ ప్రభుత్వాల చేతిలోనే ఉంటాయని సుప్రీంకోర్టు తీర్పు చెప్పడంతో కేజ్రీవాల్ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్ లభించింది. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అనేక బిల్లులను పెండింగ్‌లో పెడుతుండటంతో ప్రభుత్వానికి చికాకు కల్గిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేజ్రీవాల్ ప్రభుత్వ వాదనను సుప్రీంకోర్టు సమర్థించింది.
అధికారుల బదిలీలకు...
గత కొద్ది రోజులుగా కేజ్రీవాల్ ప్రభుత్వానికి, లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కు మధ్య అనేక వివాదాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అధికారాలపై కేజ్రీవాల్ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీంతో ఇద్దరి మధ్య నెలకొన్న వివాదానికి సుప్రీంకోర్టు తీర్పుతో ఫుల్స్టాప్ పడింది. ఎన్నికైన ప్రభుత్వానికి ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు ఉండాలని ఆదేశించింది. ఏ శాఖలో ఎవరిని నియమించాలి? నియంత్రణ ఎవరి చేతిలో ఉండాలన్న దానిపై స్పష్టమైన తీర్పు చెప్పింది. భూములకు సంబంధించిన అంశాలు మాత్రం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందని తెలిసింది.
Next Story