కేసీఆర్ వెంట కేరళ : పినరయి విజయన్
కేసీఆర్ వెంట కేరళ ప్రజలు ఉంటారని ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. ఖమ్మం బీఆర్ఎస్ సభలో ఆయన ప్రసంగించారు
కేసీఆర్ వెంట కేరళ ప్రజలు ఉంటారని ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. ఖమ్మం బీఆర్ఎస్ సభలో ఆయన ప్రసంగించారు. కేసీఆర్ ఆధ్వర్యంలో అధికార వికేంద్రీకరణ జరుగుతుందని అన్నారు. తెలంగాణ గడ్డపై వీరోచిత పోరాటం జరిగిందని, అలాంటి నేల నుంచి జాతికి మార్గం చూపించే మార్గం అభినందనీయమని పినరయి విజయన్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజలకు సంక్షేమ పథకాలను నేరుగా అందచేసిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందన్నారు. బలవంతంగా ప్రజలపై హిందీ రుద్దాలనే ప్రయత్నం జరుగుతుందని అన్నారు. కేసీఆర్ పోరాటానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు.
కేరళలోనూ కంటి వెలుగు...
కంటి వెలుగు కార్యక్రమంతో పాటు కొత్త కలెక్టరేట్ల నిర్మాణాల ప్రారంభం సంతోషదాయమని అన్నారు. ఇలాంటి పథకాలను కేరళలోనూ అమలు చేస్తామని ఆయన చెప్పారు. దేశ సార్వభౌమత్వానికి ఇది పరీక్షా సమయం అన్న పినరయి విజయన్ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే బీజేపీకి వ్యతిరేకంగా అందరం ఒక్కటై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్పొరేట్ వ్యవస్థలకు బీజేపీ సర్కార్ కొమ్ము కాస్తుందని అన్నారు. ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా మోదీ పాలన సాగుతుందని తెలిపారు.