Mon Dec 23 2024 16:28:16 GMT+0000 (Coordinated Universal Time)
ఈవీఎంలు ట్యాంపరింగా? ఆ నోళ్లు ఇప్పుడేమయ్యాయి?
మోదీ నాయకత్వంలో ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ ఘన విజయం సాధించిందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ అన్నారు
మోదీ నాయకత్వంలో ఉత్తర్ ప్రదేశ్ లో బీజేపీ ఘన విజయం సాధించిందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ అన్నారు. మోదీ పరిపాలన చూసే ప్రజలు గెలిపించారన్నారు. మిత్ర పక్షాలతో కలసి పూర్తి స్థాయి మెజారిటీని సాధించామని ఆయన తెలిపారు. లక్నోలోని పార్టీ కార్యాలయంలో యోగి ఆదిత్యానాధ్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారంటూ కొందరు అసత్య ఆరోపణలు చేశారని, ప్రజలు ఇచ్చిన తీర్పుతో వాళ్ల నోళ్లు మూతపడ్డాయని ఆయన అన్నారు.
అభివృద్ధిని చూసి...
ఉత్తర్ ప్రదేశ్ అభివృద్ధికి తమ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు. మోదీ మార్గదర్శనంలో యూపీ మరింత పురోగతిని సాధిస్తుందని యోగి ఆదిత్యానాధ్ తెలిపారు. అభివృద్ధిపై ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది అని అభిప్రాయపడ్డారు. ప్రజలు అభివృద్ధి వైపు మొగ్గు చూపుతారని ఈ ఎన్నికలు నిరూపించాయని యోగి ఆదిత్యానాధ్ తెలిపారు. బీజేపీకి అఖండ విజయాన్ని సాధించిపెట్టిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ విజయానికి కృషిచేసిన కేంద్రమంత్రులందరికీ యోగి కృతజ్ఞతలు తెలిపారు.
Next Story