Sun Dec 22 2024 21:23:21 GMT+0000 (Coordinated Universal Time)
భారత్ సహా పలు దేశాలపై చైనా నిఘా బెలూన్లు
తాజాగా.. అమెరికా మీడియా రాసిన కథనం ప్రకారం.. ఇండియా, జపాన్ సహా పలు దేశాలను చైనా నిఘా బెలూన్లతో..
చైనా నిఘా బెలూన్లను గురించిన విషయాలు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. ఒక్క అమెరికాపైనే కాదు.. చాలా దేశాలపై వైట్ బెలూన్లతో నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల అమెరికా గగనతలంలో ఓ వింతవస్తువంటూ పెద్దఎత్తున ప్రచారం జరిగింది. దానిని పరిశీలించిన అమెరికా.. నిఘా బెలూన్ గా గుర్తించి దానిని పేల్చివేసింది. అంతేకాదు. ఆ శకలాలను తిరిగి చైనాకు ఇచ్చేది లేదని కూడా స్పష్టం చేసింది.
తాజాగా.. అమెరికా మీడియా రాసిన కథనం ప్రకారం.. ఇండియా, జపాన్ సహా పలు దేశాలను చైనా నిఘా బెలూన్లతో టార్గెట్ చేసినట్లు వెల్లడైంది. "కొన్ని స్వత్సరాలుగా నిఘా బెలూన్లు చైనాలోని హైనన్ ప్రావిన్సు నుండీ ఆపరేట్ అవుతున్నాయి. అనేక దేశాల సైనిక సమాచారాన్ని ఆ బెలూన్లు సేకరించాయి. జపాన్, ఇండియా, వియత్నాం, తైవాన్, ఫిలిప్పీన్స్లో ఉన్న వ్యూహాత్మక ప్రాంతాలను బెలూన్లు టార్గెట్ చేశాయి" అని ద వాషింగ్టన్ పోస్టు మీడియా తన కథనంలో రాసుకొచ్చింది. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలోని వైమానిక దళం ఆ నిఘా బెలూన్లను ఆపరేట్ చేస్తోందని, ఇవి 5 ఖండాలపై కనిపించినట్లు వెల్లడించింది.
మరోవైపు ఇండియా సహా తమ మిత్ర దేశాలకు అమెరికా కొన్ని రహస్య అంశాలను తెలియజేసింది. గత సోమవారం అమెరికా కాలమానం ప్రకారం.. వాషింగ్టన్లో జరిగిన సమావేశంలో ఇండియాతో పాటు సుమారు 40 దేశాలకు చెందిన ఎంబసీ అధికారులు పాల్గొన్నారు. వారికి నిఘా బెలూన్ల గురించిన విషయాలను డిప్యూటీ విదేశాంగ మంత్రి వెండీ షేర్మాన్ వెల్లడించారు.
Next Story