Sat Nov 23 2024 08:50:53 GMT+0000 (Coordinated Universal Time)
వామ్మో.. ఆమెతో భారత్ కు అంత ప్రమాదమా
దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం నేపాల్ సన్యాసి వేషంలో ఉన్న చైనా మహిళను దేశ రాజధానిలో అదుపులోకి తీసుకుంది. సమాచారం ప్రకారం ఢిల్లీలోని మజ్ను కా తిలాలో సోదాలు జరిపిన తర్వాత కై రువో అనే చైనా మహిళను అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. తదుపరి విచారణ తర్వాత, అరెస్టయిన విదేశీయురాలు నకిలీ నేపాల్ గుర్తింపుతో భారతదేశంలో నివసిస్తున్నట్లు తేలింది.
"ఢిల్లీలోని మజ్ను కా తిలా నుండి సోమవారం మధ్యాహ్నం 1 గంటలకు చైనా మహిళను అదుపులోకి తీసుకున్నారు. వెరిఫికేషన్ సమయంలో, నేపాల్‌లోని ఖాట్మండు నివాసి డోల్మా లామా పేరుతో ఒక నేపాల్ పౌరసత్వ ధృవీకరణ పత్రం ఆమె వద్ద నుండి స్వాధీనం చేసుకుంది" అని ఒక పోలీసు అధికారి తెలిపారు. ఫారిన్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (FRRO)ని సంప్రదించిన తర్వాత, అరెస్టయిన ఆమె చైనా పౌరురాలని, 2019లో చైనా నుండి తిరిగి భారతదేశానికి వచ్చిందని తెలుస్తోంది. ఆమె ఒక బౌద్ధ సన్యాసి ముసుగులో, సాంప్రదాయ వస్త్రాన్ని ధరించి ఇక్కడ జీవిస్తోంది. ఆమె రికార్డులను తనిఖీ చేశామని, కై రుయో 2019లో చైనీస్ పాస్‌పోర్ట్‌ను ఉపయోగించి భారత్‌కు వచ్చినట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. చైనా కమ్యూనిస్టు పార్టీలో కొందరు నేతలు ఆమెను చంపాలని ప్రయత్నిస్తున్నట్లు ఆమె చెప్పినట్లు విచారణలో పోలీసులు తెలిపారు. ఆమెకు ఇంగ్లీష్, మాండరిన్, నేపాలీ.. ఇలా మూడు భాషలు తెలుసు. ఆమెను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ కేసును విచారిస్తున్నట్లు తెలిపింది.
Next Story