Mon Dec 23 2024 14:31:25 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో స్వీట్ బాక్స్ కలకలం.. అవాక్కయిన అధికారులు
బ్యాగులో స్వీట్ బాక్సులు, దుస్తులు తప్ప ఏమీ కనిపించలేదు. సమాచారం తప్పై ఉండదన్న అనుమానంతో..
సాధారణంగా స్వీట్ బాక్సులలో ఏముంటాయి. మహా అయితే స్వీట్లు, ఒక్కోసారి హాట్ కూడా ఉంటాయి. కానీ ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి వద్దనున్న స్వీట్ బాక్సులు కలకలం రేపాయి. వాటి అట్టపెట్టెల్లో ఉన్నదానిని చూసి కస్టమ్స్ అధికారులు అవాక్కయ్యారు. బుధవారం విమానాశ్రయంలోని టెర్మినల్ 3 వద్ద సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిని సీఐఎస్ఎఫ్ అధికారులు అడ్డుకున్నారు. అతడి వద్ద విదేశీ కరెన్సీ ఉందని అనుమానించి కస్టమ్స్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దాంతో అధికారులు సదరు వ్యక్తి బ్యాగులను తనిఖీ చేశారు.
బ్యాగులో స్వీట్ బాక్సులు, దుస్తులు తప్ప ఏమీ కనిపించలేదు. సమాచారం తప్పై ఉండదన్న అనుమానంలో స్వీట్ బాక్సులను తెరిచి.. వాటి అట్టపెట్టెలను చింపి చూస్తే.. అసలు విషయం బయటపడంది. ఎవరూ గుర్తించలేని విధంగా స్వీట్ బాక్స్ అట్టపెట్టెల్లో సౌదీ కరెన్సీని పెట్టుకొచ్చాడు ఆ ప్రయాణికుడు. అతని వద్ద స్వాధీనం చేసుకున్న సౌదీ కరెన్సీ విలువ రూ.54 లక్షలుగా ప్రకటించారు. స్వీట్ బాక్స్ అట్ట పెట్టె ఫోల్డింగ్ లలో కనిపించని విధంగా నోట్లను మడిచి పెట్టడం గమనార్హం. ఇప్పుడీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Next Story