Mon Dec 23 2024 08:32:16 GMT+0000 (Coordinated Universal Time)
పాఠశాలలో విషం తాగిన విద్యార్థులు.. ఒకరు మృతి
ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెళ్లితో.. జీవితాంతం కలిసుండాలని భావించారు. కానీ.. అందుకు తల్లిదండ్రులు ..
వారిద్దరూ ఒకే పాఠశాలలో చదువుకుంటున్నారు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుందామని భావించి.. ప్రేమ విషయం ఇరువురి ఇళ్లలో చెప్పారు. అందుకు పెద్దలు ఒప్పుకోకపోవడంతో.. ఒకరిని విడిచి ఒకరు ఉండలేమనుకుని.. మనస్తాపంతో పాఠశాలలోనే విషం తాగేశారు. ఈ ఘటనలో అబ్బాయి మృతి చెందగా.. అమ్మాయి పరిస్థితి విషమంగా ఉంది. ఉత్తరప్రదేశ్ లోని మహారాజ్ గంత్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
12వ తరగతి విద్యార్థి (20), ఓ అమ్మాయి (16) స్థానికంగా ఉండే ఓ పాఠశాలలో చదువుకుంటున్నారు. ఇద్దరిదీ ఒకే గ్రామం. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెళ్లితో.. జీవితాంతం కలిసుండాలని భావించారు. కానీ.. అందుకు తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అమ్మాయి మైనర్.. పైగా ఇద్దరివీ వేర్వేరు కులాల. దాంతో మనస్తాపం చెందిన వారిద్దరూ తనువు చాలించాలని భావించి.. పాఠశాల ప్రాంగణంలో విషం తాగారు. ఈ విషయాన్ని గుర్తించిన పాఠశాల సిబ్బంది వారిద్దరినీ ఆసుపత్రికి తరలించారు. అబ్బాయి చికిత్స తీసుకుంటూ మృతి చెందాడని నిచ్లౌల్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్వో ఆనంద్ కుమార్ గుప్తా తెలిపారు. అతడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపామని, అమ్మాయి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోందని అధికారులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story