Sun Mar 23 2025 07:41:32 GMT+0000 (Coordinated Universal Time)
రేపు మరోసారి ఢిల్లీకి వెళ్లనున్న సీఎం జగన్
తాజాగా మరోసారి ఆయన ఢిల్లీ పర్యటనకు బయల్దేరనున్నారు. రేపు ఢిల్లీ వెళ్లి.. రాత్రికి అక్కడే బస చేయనున్నారు.

తాడేపల్లి : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవలే ఢిల్లీ పర్యటనకు వెళ్లొచ్చారు. తాజాగా మరోసారి ఆయన ఢిల్లీ పర్యటనకు బయల్దేరనున్నారు. రేపు ఢిల్లీ వెళ్లి.. రాత్రికి అక్కడే బస చేయనున్నారు. ఏప్రిల్ 30న జరిగే జ్యుడీషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో జగన్ పాల్గొననున్నారు. ఈ సదస్సుకు ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీరమణ సహా.. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు.
జ్యుడీషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో అన్ని రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు పాల్గొననున్నారు. ఈ సదస్సులో ప్రధానంగా.. న్యాయ, కేసుల సత్వర పరిష్కారం, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై చర్చించనున్నారు. సదస్సు తర్వాత సీఎం జగన్.. ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. ఈ భేటీలో విశాఖ పాలనా రాజధాని అంశాన్ని జగన్ ప్రస్తావించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
Next Story