Mon Dec 23 2024 12:37:39 GMT+0000 (Coordinated Universal Time)
రేపు ఢిల్లీలో బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ప్రారంభం
ఈ నెల 9న తెలంగాణ భవన్ వద్ద సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మార్చుతూ.. ఎన్నికల కమిషన్ పంపిన..
ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్ లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం రేపు మధ్యాహ్నం ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12.47 గంటలకు బీఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. తొలుత పార్టీ జెండా ఆవిష్కరణతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ వేడుకకు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి హాజరుకానున్నారు. అలాగే పంజాబ్, హర్యానా, తమిళనాడు, ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన రైతు నేతలు, ప్రముఖ రాజకీయ నాయకులు కూడా హాజరుకానున్నారు.
కాగా.. ఈ నెల 9న తెలంగాణ భవన్ వద్ద సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ జాతీయ పార్టీగా మార్చుతూ.. ఎన్నికల కమిషన్ పంపిన పత్రాలపై సంతకం చేశారు. తొలుత పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణలో జరిగిన ఈ కార్యక్రమానికి కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, సినీ నటుడు, రాజకీయవేత్త ప్రకాష్ రాజ్ హాజరయ్యారు. కొన్నేళ్లుగా టీఆర్ఎస్ జాతీయ పార్టీగా ఆవిర్భవిస్తుందని చెబుతూ వచ్చిన కేసీఆర్..ఆ మాటను నిజం చేశారు. ఇప్పుడు బీఆర్ఎస్ తో ఎవరెవరు కలిసి నడుస్తారో చూడాలి.
Next Story