Sun Dec 22 2024 03:31:36 GMT+0000 (Coordinated Universal Time)
Good News CNG prices cut: భారీగా తగ్గిన CNG ధర
ముంబైకి చెందిన మహానగర్ గ్యాస్ లిమిటెడ్ (MGL) కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్
Good News CNG prices cut:ముంబైకి చెందిన మహానగర్ గ్యాస్ లిమిటెడ్ (MGL) కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG) ధరను తగ్గించింది. ఇప్పుడు కిలోగ్రాము రూ. 73.50కి ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇది మార్చి 5, 2024 అర్ధరాత్రి నుండి ఈ ధర ప్రారంభమైంది. గ్యాస్ ధర తగ్గిన కారణంగా.. ముంబై.. చుట్టుపక్కల ప్రాంతాలలో CNG ధర కిలోగ్రాముకు రూ. 2.5 తగ్గింది. MGL ప్రధానంగా ముంబైలో CNGని సరఫరా చేస్తుంది. CNG ధర కిలోకు 2.5 రూపాయల వరకు తగ్గడంతో వినియోగదారులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. CNG ధరలో ఈ తగ్గింపు భారతదేశంలోని ఎకో ఫ్రెండ్లీ రవాణా కోసం సహజ వాయువును ఉపయోగించేలా ఎక్కువ మందిని ప్రోత్సహిస్తుందని కంపెనీ విశ్వసిస్తోంది. మంగళవారం బిఎస్ఇలో ఎంజిఎల్ షేరు 1.15 శాతం పెరిగి రూ.1564.85 వద్ద ముగిసింది.
గ్యాస్ ఉత్పత్తి వ్యయం తగ్గిందని, దాని కారణంగా సిఎన్జి ధర తగ్గిందని ఎంజిఎల్ ప్రతినిధులు తెలిపారు. ఉత్పత్తి వ్యయం తగ్గడం వల్ల దేశంలోని ఇతర ప్రాంతాల్లో సీఎన్జీ ధరలు తగ్గే అవకాశం ఉంది. దేశ రాజధాని ఢిల్లీ, పరిసర ప్రాంతాలలో (NCR) CNG ధరలు స్థిరంగా ఉన్నాయి. ఢిల్లీలో సీఎన్జీ ధర కిలో రూ.76.59గా ఉంది.
Next Story