Mon Dec 23 2024 02:52:17 GMT+0000 (Coordinated Universal Time)
నా స్నేహితుడు కేజ్రీవాల్ కు శుభాకాంక్షలు : కమల్ హాసన్
పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
పంజాబ్ ఎన్నికల ఫలితాలు నిన్న వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా సినీ నటుడు కమలహాసన్ కూడా ఈ విషయంపై స్పందించారు. అరవింద్ కేజ్రీవాల్ కు శుభాకాంక్షలు తెలిపారు.
''ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు నా స్నేహితుడు అరవింద్ కేజ్రీవాల్ కు, ఆమ్ ఆద్మీ పార్టీకి శుభాకాంక్షలు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిర్భవించిన పదేళ్లలోనే మరో రాష్ట్రం పంజాబ్లోనూ విజయం సాధించడం ప్రశంసనీయం'' అని కమలహాసన్ ట్వీట్ చేశారు. పంజాబ్ లో ప్రభుత్వం ఏర్పాటుకు ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. ఢిల్లీ మాదిరిగానే పంజాబ్ లోనూ అవినీతి రహిత పాలన అందిస్తామని పార్టీ నేతలు చెప్తున్నారు.
Next Story