Sun Dec 22 2024 18:35:14 GMT+0000 (Coordinated Universal Time)
హిమాచల్ లో నువ్వా? నేనా?
హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్, బీజేపీ నువ్వా? నేనా అన్నట్లు ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి
హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్, బీజేపీ నువ్వా? నేనా అన్నట్లు ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి. మొత్తం 68 స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్ లో నెక్ టు నెక్ పోటీ ఉంటుందని చెప్పింది. ఎవరిది గెలుపు చెప్పడం కష్టంగా ఉందని కొన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. బీజేపీకి 29 నుంచి 39, అలాగే కాంగ్రెస్ కు 27 నుంచి 37 స్థానాలు సాధించే అవకాశముందని తేల్చాయి.
పోటా పోటీగా...
టైమ్స్ నౌ సర్వేలో బీజేపీకి 38 స్థానాలు హిమాచల్ ప్రదేశ్లో రావచ్చని చెప్పింది. కాంగ్రెస్ కు 28 స్థానాలు దక్కవవచ్చని తెలిపింది. పీపుల్స్ పల్స్ సర్వేలో మాత్రం హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీకి 27 నుంచి 37 స్థానాలు దక్కవవచ్చని తెలిపింది. అదే సమయంలో కాంగ్రెస్ కూడా 29 నుంచి 39 స్థానాలు దక్కించుకునే అవకాశాలున్నాయని తేల్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ సింగిల్ డిజిట్ కే పరిమితమయింది
Next Story