Fri Dec 20 2024 19:14:25 GMT+0000 (Coordinated Universal Time)
క్యాంప్ నకు చేరుకున్న కాంగ్రెస్ అభ్యర్థులు
గోవా లో కాంగ్రెస్ అభ్యర్థులను ముందు జాగ్రత్త చర్యగా క్యాంప్ లకు తరలించారు. గోవా ఎన్నిలక ఫలితాలు రేపు రానున్నాయి.
గత చేదు అనుభవాలు కాంగ్రెస్ కు గుణపాఠాలు నేర్పినట్లే కన్పిస్తున్నాయి. గోవా లో కాంగ్రెస్ అభ్యర్థులను ముందు జాగ్రత్త చర్యగా క్యాంప్ లకు తరలించారు. గోవా అసెంబ్లీ ఎన్నిలక ఫలితాలు రేపు రానున్నాయి. అయితే అన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్ గోవాల్ హంగ్ దిశగా ప్రభుత్వం ఏర్పడే అవకాశముందని చెప్పాయి. కాంగ్రెస్, బీజేపీల మధ్య నెక్ టు నెక్ ఫైట్ జరిగిందని ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. దీంతో కాంగ్రెస్ తన అభ్యర్థులను క్యాంప్ నకు తరలించింది.
రేపు ఫలితాలు....
గోవాలో 2017లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 17 స్థానాలను గెలిచినా అధికారానికి దూరం కావాల్సి వచ్చింది. పార్టీ శాసనసభ్యులను బీజేపీ మచ్చిక చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పటు చేసింది. చివరకు 17 నుంచి ఇద్దరికి ఆ సంఖ్య చేరుకుంది. అప్పట్లో దిగ్విజయ్ గోవా కాంగ్రెస్ ఇన్ ఛార్జిగా ఉండేవారు. ఇది జరిగిన వెంటనే ఆయనను ఆ పదవి నుంచి అధిష్టానం తప్పించింది. ఇప్పుడు మరోసారి అటువంటి అవకాశం ఇవ్వకుండా ముందుగానే తన అభ్యర్థులను కాంగ్రెస్ నాయకత్వం క్యాంప్ నకు తరలించింది.
Next Story