Sat Dec 21 2024 08:29:45 GMT+0000 (Coordinated Universal Time)
నేడు రాహుల్ భారత్ జోడో యాత్ర
నేడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం ఐదు గంటలకు ఈ యాత్ర ప్రారంభం కానుంది
నేడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం ఐదు గంటలకు ఈ యాత్ర ప్రారంభం కానుంది. ముందుగా తమిళనాడులోని శ్రీపెరుంబదూరులో ఉన్న తండ్రి రాజీవ్ గాంధీ స్మారక కేంద్రాన్ని రాజీవ్ గాంధీ దర్శించారు. తమిళనాడులోని కన్యాకుమారి నుంచి జమ్మూకాశ్మీర్ లోని శ్రీనగర్ వరకూ ఈ జోడో యాత్ర జరగనుంది. ఈ యాత్రలో ప్రజలను నేరుగా కలసి వారి సమస్యలను స్వయంగా అడిగి రాహుల్ గాంధీ తెలుసుకోనున్నారు.
3,570 కిలోమీటర్లు...
రాహుల్ గాంధీ శ్రీపెరంబదూర్ నుంచి తిరువనంతపురం మీదుగా కన్యాకుమారికి చేరుకుంటారు. అక్కడ స్వామి వివేకానంద, తిరువళ్లువర్ విగ్రహాలతో పాటు మాజీ ముఖ్యమంత్రి కామరాజ్ స్మారకాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత మహాత్మాగాంధీ మండపం వద్ద తమిళనాడు ముఖ్యమంత్రి ఏకే స్టాలిన్ జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈరోజు లాంఛనంగా ప్రారంభించినా రేపటి నుంచి రాహుల్ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఆయన వెంట 117 మంది నేతలు పాల్గొంటున్నారు. ఈ యాత్ర ఐదు నెలల పాటు సుమారు 3,570 కిలోమీటర్లు సాగనుంది. అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తుంది. 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను టచ్ చేస్తూ ఈ యాత్ర వెళుతుంది.
Next Story