Mon Dec 23 2024 11:55:50 GMT+0000 (Coordinated Universal Time)
కాంగ్రెస్ చీఫ్ గా ఖర్గే
మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరింత ముందుకు వెళుతుందని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ అన్నారు
మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరింత ముందుకు వెళుతుందని కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ అన్నారు. ఖర్గే పదవీ బాధ్యతల స్వీకారం సందర్భంగా ఆమె మాట్లాడారు. అంతకు ముందు ఎన్నికల అధికారి మిస్త్రీ నుంచి ఆయన అధికారికంగా అధ్యక్షుడిగా ఎన్నికయినట్లు లేఖ అందుకున్నారు. పార్టీ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయన్నారు. ఖర్గేకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని సోనియా తెలిపారు. ఖర్గే అనుభవం ఉన్న నాయకుడని ఆమె ప్రశంసించారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయిన ఖర్గేకు ఆయన అభినందనలు తెలిపారు.
కాంగ్రెస్ సిద్ధాంతాలను...
ఎందరో అగ్రనేతలు అధిష్టించిన ఈ పదవి దక్కడం తనకు సంతోషంగా ఉందని నూతన అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. తన అనుభవాన్ని ఉపయోగించి కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ తో తన అనుబంధం ఈనాటిది కాదన్నారు. సోనియా సలహాలతో కాంగ్రెస ను ముందుకు తీసుకెళ్లేందుకు తాను ప్రయత్నిస్తానని ఖర్గే చెప్పారు. కాంగ్రెస్ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని ఆయన తెలిపారు. పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ ఎప్పుడూ నిలిచిందన్నారు. తనపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికీ ఖర్గే కృతజ్ఞతలు తెలిపారు. చింతన్ భైటక్ లో సోనియా నేతృత్వంలో రూపొందించిన రూట్ మ్యాప్ ప్రకారం తాను పార్టీని ముందుకు తీసుకెళతానని తెలిపారు.
Next Story